ఇప్పుడు ఇండియాలో పాస్ పోయ్యాలంటే కూడా “అధార్ కార్డ్” ఉండాలి! అంతలా ఆధార కార్డ్ కి అన్నీ లింక్ చేసిపారేశారు. మొబైల్ కనక్షన్, గ్యాస్ కనక్షన్, ట్రైన్ టికెట్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇలా ప్రతి దానికీ ఆధార్ కి లింక్ చెయ్యడమే కాకుండా ఫలానా తేదీ లోపల లింక్ చెయ్యకపోతే మీ కనక్షన్ తొలిగించబడును అని వార్నింగులు సైతం ఇస్తున్నారు.రూ.50 వేలకు పైగా లావాదేవీలు జరిపే కొత్త, పాత బ్యాంకు ఖాతాలన్నింటికీ ఆధార్‌ నంబరును 2018 మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అయితే, కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచే వారు మాత్రం ఆ తేదీ నుంచి ఆరు నెలల్లోపు లేదా

మార్చి 31వ తేదీ లోపు ఏది ఎక్కువ టైం అయితే ఆ లోపు ఆధార్‌ను ఆనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాలు, మ్యూచవల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు తదితర వాటన్నింటితో ఆధార్‌‌ కార్డ్ ని ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలోసుప్రీం కోఅర్ట్ తీర్పు ఇచ్చింది.బ్యాంకులు, మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానానికి ‘మార్చి 31’ డెడ్ లైన్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి డెడ్‌లైన్లు లేవని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ బెంచ్‌కు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. ఆధార్ తప్పనిసరంటూ కేంద్ర బలవంతం చేయడం తగదని పేర్కొన్నారు. అయితే ఈ తాజా నిర్ణయం తో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది, అందరిని ఆధార్ తీసుకోమని బలవంత పెట్టటం, కంప్లసరిగా ఆధార లింక్ చెయ్యాలి అని చెప్పటాన్ని చాల మంది వ్యతిరేకించారు. ఒక పక్క ఆదరా డాటా లీక్ అవుతుంది అని వార్తలు వస్తున్న తరుణం లో అసలు ఆధార్ ని ఎంత వరకు నమ్మవచ్చు

అనే సందేహాలు వెలువడుతున్నాయి. అంతే కాక ఆధార కోసం తెల్లవారు జాము నుంచి గంటల తరబడి లైన్ లో ఉండాల్సిన పరిస్థితి సైతం ఉంది. అందుకే ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పు చాలా మందికి రిలీఫ్ ఇస్తుంది.