నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లా నిజాయితీ గా ఉండే ఆవేశం ఉండే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాస్తవానికి అసలు లేరు.

అది ఆవేశంతో ఇక్కడ చంద్రబాబు కి, అక్కడ మోడీ కి మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దేశానికి ప్రజలకి ఎదో చెయ్యాలి అన్న తపన ఎక్కువ ఉంది కాబట్టే యువత లో మంచి ఫాలోయింగ్ సాధించాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత తన షూటింగ్ లో బిజీ గా ఉండి, ఖాళి దొరికినప్పుడు జనసేన కార్యకలాపాలు చూస్తున్నాడు. అదే సమయం లో జనసేనను కింద స్థాయి నుంచి నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే 2019 లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేస్తాము అని చెప్పిన పవన్ కళ్యాణ్ మీద రాజకీయం గా దాడి మొదలయ్యింది. యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నేత నుంచి, రోజా స్థాయి ఉన్న నాయకులు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

అదే క్రమం లో పవన్ పోలవరం 2018లోగా పూర్తీ కావటం అసాధ్యం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఒక కలకలం మొదలయ్యింది. స్వయం గా యనమల కలిపించుకుని 2018 కి పోలవరం పూర్తీ అవుతుంది, ఈ విషయం లో పవన్ తో సహా ఎవరికీ సందేహం అక్కర్లేదు అని మెత్తగా చురకలు వేసారు.

ఇప్పుడు పాయకరావు పేట ఎమ్మల్యే వంగలపూడి అనిత కూడా పవన్ కళ్యాణ్ ఆవేశం తో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అనవసరపు ఆవేశం అనర్ధం అని హితవు చెప్పారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ నాయకుడు చంద్రబాబు ఒక మాట చెపితే అది వాస్తవ రూపం దాల్చుతుంది అని, ఆయన ఒక మాట మాట్లాడేముందు ఏంటో ఆలోచించి పూర్తీ అవగాహనతో మాట్లాడతారు అని, కాబట్టి పోలవరం విషయం లో పవన్ కు సందేహాలు అక్కర్లేదు అని సూచించారు. 2014 ఎన్నికల తర్వాత తెదేపా నుంచి ఇంత ఘాటు విమర్శలు రావటం ఇదే తొలిసారని, ఇది ఎటు దారి తీస్తుందో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.