డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రదీప్ ఫూటుగా మద్యం సేవించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఐతే ఆ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ ఈ రోజు నాంపల్లి కోర్ట్ కి హాజరు అయ్యాడు. విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.  ప్రదీప్ వాదనలు విన్న కోర్ట్ అతనికి శిక్ష ఖరారు చేసి  చట్టం ముందు అందరు సమానమే అని నిరూపించింది. ప్రదీప్ కి 2100/- రూపాయిల జరిమానాతో పాటు, ప్రదీప్  డ్రైవింగ్ లైసెన్సు లో మూడేళ్ళ పాటు రద్దు చేసింది. ఐతే ప్రదీప్ పట్టుబద్దప్పటి నుంచి జైలు శిక్ష ఖాయం అన్నారు. అంతే కాకుండా ప్రదీప్ దొరికినప్పుడు కార్ లో ఉన్న అమ్మాయ్ ఒక రాజకీయ నాయకుడి కూతురు అని కాదు కాదు ఒక టివి యాంకర్ అని రకరకాలు గా ప్రచారం జరిగింది. ఇప్పుడు 178 పాయింట్లతో దొరికిన ప్రదీప్ కి జెయిల్ శిక్ష దేనికి పడలేదు? ఎలా తప్పించుకున్నాడు అనే డిస్కషన్ జరుగుతుంది. ఐతే శిక్ష దేనికి పడలేదో మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

మారిన ట్రాఫిక్ నిభందనల ప్రకారం కనీసం ఒక్క రోజు నుంచి వారం వరకు జెయిల్ శిక్ష పడుతుంది అని మీడియా లో స్పెక్యులేషన్స్ వచ్చాయి. కాని ప్రదీప్ కి జెయిల్ శిక్ష పడలేదు, కాని అంత కంటే తీవ్రమైన శిక్ష పడింది. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యింది.కాని జెయిల్ శిక్ష దేనికి పడలేదు అని ఆరా తీస్తే ప్రదీప్ కి గతంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అంతే కాక డ్రింక్ అండ్ డ్రైవ్ పరిణామాల మీద తన కార్యక్రమాల ద్వారా తెలిసేలా చేస్తాను అని చెప్పాడట. అంతే కాక ఇక ముందు పొరపాటు చెయ్యను అని,ఎటువంటి ఉల్లంఘనలు పాల్పదానని హామీ ఇచ్చాడట. దానితో సమాధానపడిన 6 నెలలు ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్సు రద్దుని మూడేళ్ళకి పెంచినట్టు గా తెలుస్తుంది. కేవలం తన మంచితనం వల్ల ప్రదీప్ జెయిల్ శిక్ష నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తుంది.