స్టువర్ట్ పురం,ఈ ఊరి పేరు వింటేనే రాష్ట్రంలో ముఖం చిట్లించుకుంటారు, స్టువర్ట్ పురం లో దొంగలు మాత్రమె ఉన్డతారు అనేది ఒక అపోహ అని చెప్పటానికే అన్నట్టు ఆ వూర్లో పుట్టిన ఒక వ్యక్తి వెంకట్ రాహుల్ తండ్రి. ఆ ఊరు మాములుగా వెళ్ళే దారిలో తాను పోకుండా, ఎంత కడుపు మాడినా తన పిల్లల్ని కూడా తనెంచుకున్న దారిలోనే ట్రైన్ చేయడం నిజంగా గొప్ప విషయం. భవిష్యత్ మీద భరోసాతో, ఏవిధమైన ఆధారం లేకపోయినా, తన పిల్లల మీద నమ్మకంతో జీవితమంతా కూడబెట్టి కట్టుకున్న ఇంటిని అమ్మి, పూరి గుడిసేలోకి మారి దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం అనేది ఎవ్వరి ఊహకి కూడా అందని విషయం!

తన కాన్సర్ ట్రీట్మెంట్ కి డబ్బులు ఖర్చు పెడితే పిల్లాడి ట్రైనింగ్ కి ఎక్కడ చాలవేమో అని రోగాన్ని కూడా దాచుకుని మరీ కొద్ది కాలమే బతికిన ఆ తల్లి ప్రేమ ని,త్యాగాన్ని వర్ణించగలమా? నిజానికి ఆవిడ రెండు సార్లు జన్మనిచ్చింది రాహుల్ కి ..ఒకసారి చంటి బిడ్డగా, ఇంకోసారి ఈరోజు చాంపియన్ గా! భూప్రపంచం మీద కేవలం ఒక్క తల్లి మాత్రమే చేయతగ్గ త్యాగం ఆవిడది. ఆ తల్లి త్యాగాన్ని గుర్తించిన నెమరేసుకునే కుటుంబం వుండడం కూడా అరుదైనదే.మొదటి గురువు కూడా అయిన తండ్రి,రెండుసార్లు జన్మ ఇచ్చి ద్విజుడి ని చేసిన తల్లి చిత్రాలను గుండెలమీద పచ్చబొట్టు పోడిపించుకున్న రాహుల్ ఆవిడ కాలి మెట్టెలను లాకేట్ గా ధరింఛి పోటీలో పాల్గోనేపుడు పచ్చ బోట్టులో అమ్మని చూసుకుని ,లాకెట్ ను నుదుటిపై తాకించి ఆవిడ దీవెనలను అందుకుని ఆత్మ విశ్వాసం తో తోడ కొట్టడం అమ్మతనానికి సింహాసనం వేసి మరీ అతను కూర్చోబెట్టిన తీరు నిజంగా ఒక అపూర్వ దృశ్యం. అగ్రకులాల్లో పుట్టి తల్లితండ్రులను అర ఎకరం కోసమో ,తాగుడుకి కావాల్సిన పైసలకోసం నరికి చంపిన ఎన్నో ఉదాహరణలు మనం పాపర్ తీస్తే, టివి చుస్తే.బస్ స్టాప్ దగ్గర ,స్మసానాల దగ్గర వదిలేసి వాళ్ళ సంపాదనలతో కులికే బిడ్డలా మధ్య నిజంగా రాహుల్ అరుదైన ప్రాణి కూడా! జన్మ సంస్కారమ్ అని సంకలు గుద్దుకునే ఎంతో మందికి అతనో కనువిప్పు. ప్రభుత్వం కొంత సాయం చేసింది,ఇంకా చెయ్యాల్సిన సాయం వుంది,


ప్రకటించిన ఇల్లు, పొలం కూడా త్వరగా అందేట్లు బ్యూరోక్రసి త్వరగా కనికరించాలి, వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచెంత త్వరగా ఆ సాయాన్ని అతని దరికి చేర్చండి, ఒలింపిక్ లక్ష్యాన్ని అందుకుని ఆ మెడల్ ని తల్లి పటాని కి అలంకరించాలని కోరుకుందాం. నిజం గా రాహుల్ కథలో మనం చూడాల్సింది కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం నెగ్గటం కానే కాదు. అంత కన్నా బాగా నచ్చాల్సింది అతని ఆటిట్యూడ్, చేసే పని పట్ల అతని సిన్సియారిటి, అంతే కాకుండా ఒకరి మీద ఒకరికి ఉన్న అమూల్యమైన వాళ్ళ కుటుంబ ప్రేమలు విలువలు అతని మెడల్ కంటే ఎక్కువ నచ్చాలి.