ఎవరిని కించపరచటానికి కాదు…. సరదాగా నవ్వుకోటానికే

ఒక పిల్లాడు కోడి గుడ్లు బుట్టతో సైకిల్ తొక్కుతూ ఒక రాయిని ఢీ కొని పడిపోయాడు..గుడ్లన్నీ పగిలిపోయాయి..

జనం గుమిగూడారు..

సైకిల్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి..
సున్నితమైన వస్తువులు ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాల్సింది..ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు..

సమూహంలోనుంచి ఒక పెద్దాయన వచ్చి..అరెరె..గుడ్లన్నీ పగిలిపోయాయే..! పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు ఇదిగో బాబు ఈ పది రూపాయలు ఉంచుకో..చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు..ఎవరైనా సహాయం చేస్తే కాదనకు..చెప్పి వెళ్ళిపోయాడు..

ఇదంతా చూసిన జనం ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు..మొత్తానికి వీడికి పగిలిపోయిన గుడ్లు విలువ కంటే ఎక్కువ మొత్తం డబ్బులొచ్చాయి..

గుంపులో ఒకతను. నువ్వు అదృష్టవంతుడివి..ఆ ముసలాడు లేకపోతే నువ్వు నీ యజమానికి సమాధానం చెప్పుకోలేపోయోవాడివి..

పిల్లాడు నవ్వుతూ..
ఆ ముసలాడే నా యజమాని..
అతని దగ్గరే నేను పనిచేస్తుంది..
అతను గుజరాతీ..
వాడు పెద్ద ముదురు.