TDP-MPS-want-to-contest-from-Assembly_a
TDP-MPS-want-to-contest-from-Assembly_a

2014 ఎన్నికల్లో తెదేపా విజయ దుందుభి మోగించింది. అదే ఊపులో 15 ఎంపి స్థానాల్లో పాగా వేసింది.

కాని రాబోయే 2019 ఎన్నికల్లో ఈ గెలిచిన ఎంపిల్లో ఆరుగురు అసెంబ్లీకి పోటి చెయ్యటానికి నిర్ణయించుకున్నట్టు తెల్సింది. వీరిలో గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, హిందూపూర్ ఎంపి నిమ్మల కిష్టప్ప,ఏలూరు ఎంపీ మాగంటి బాబు, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు లతో పాటు చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ లు ఉన్నట్టు తెలుస్తుంది.

TDP-MPS-want-to-contest-from-Assembly_a

వీరంతా అసెంబ్లీకి పోటి చెయ్యటానికి రకరకాల కారణాలు ఉన్నాయట. నిమ్మల కిష్టప్ప ఈ సారి పుట్టపర్తి నుంచి అసెంబ్లీకి  పోటి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏలూరు ఎంపి మాగంటి బాబు ఈ సారి కైక‌లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యటానికి ఉవ్విళ్ళురుతున్నట్టు తెలుస్తుంది. కాగా చిత్తూర్ ఎంపి శివప్రసాద్ కూడా ఈ సారి అసెంబ్లీకి పోటి చెయ్యాలని కోరుకుంటున్నారట.

TDP-MPS-want-to-contest-from-Assembly_a

ఇదిలా ఉండగా వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఈసారి విజయనగరం నుంచి అసెంబ్లీ లోకి కాలు పెట్టాలని చూస్తున్నారట. అంతే కాక గుంటుర్ ఎంపి గల్లా జయదేవ్ ని చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటి చెయ్యమని గల్లా కుటుంబ అభిమానులు కోరుతున్నారట. ప్రస్తుత ఎమ్మెల్యే వైకాపాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాల నుంచి కాపాడమని పదే పదే వస్తున్న విజ్ఞప్తుల నేపధ్యంలో గల్లా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.తన వర్గాన్ని కాపాడుకోటానికి చంద్రగిరికి వెళ్లేందుకు జయదేవ్ సుముఖంగా ఉన్నట్టే తెలుస్తుంది. అంతేకాక యువ ఎంపి రామ్మోహన్ నాయుడు వచ్చేసారి  ఎమ్మెల్యేగా పోటి చెయ్యాలని కోరుకుంటున్నారట.

TDP-MPS-want-to-contest-from-Assemkly

ఎవరి అంచానాలు ఎలా ఉన్నా, అధినేత నిర్ణయం ఫైనల్ అని అందరికి తెల్సి ఉండటంతో ఇప్పటికే చంద్రబాబు ని కలిసి తమ మనసులో మాట బయట పెట్టినట్టు తెల్సింది. ఎంపిలు పెట్టిన ఈ కొత్త తలనొప్పితో చంద్రబాబు అసహనం గా ఉన్నట్టు తెలుస్తుంది, ఎన్నికల నాటికి చూద్దాం అని చెప్పి వారిని సమాధానపరిచినట్టుగా వినికిడి.