ఒక సమర్ధుడు అధికారం లో ఎలా ఉంటుంది అనేది మన ఆంధ్రప్రదేశ్ ని చుస్తే తెలుస్తుంది. చంద్రబాబు అధికారం లోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మారింది అనేది అందరూ ఒప్పుకుంటున్న నిజం. కొన్ని కొన్ని కీలక శాఖలో సమస్యలు ఉన్నా మొత్తం గా ప్రభుత్వ పని తీరు బావుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సమర్ధవంతమైన చంద్రబాబు పాలన మీద విజయ్ అనే ఫేస్బుక్ యూజర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ స్తాపించుదాం అని చూస్తున్న ఒక ఔత్సాహికుడు విజయ్. ఎపి పరిశ్రమల వెబ్ సైట్ ద్వారా అనుమతుల కోసం అప్లై చేస్తున్నాడు. అయితే ఈ వెబ్సైట్ లో లాండ్ కన్వర్షన్ రేట్ల మీద తగ్గింపు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేసిన జిఓ వివరాలు వెబ్సైట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదట. అదే విషయాన్ని పరిశ్రమల శాఖ కమీషనర్ కి విజయ్ తెలియ చేసాడట. కాసేపట్లోనే ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చిందట. ఇంకొక్క నాలుగు ఐదు రోజుల్లో అది అప్డేట్ అవుతుందని అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమని రిక్వెస్ట్ చేసారట కమీషనర్. అవసరం అయితే మీ సేవ నుంచి అప్లై చేస్తాను విజయ్ అడుగగా, ఒక్క నాలుగు రోజులు ఉండండి టెస్టింగ్ పూర్తీ అయిన వెంటనే వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాం అని చెప్పారట. అయితే అంత వెంటనే స్పందన వచ్చే సరికే క్లీన్ బౌల్డ్ అయిన విజయ్, దయ చేసి కాస్త ఓపిక పట్టండి అని అంత సున్నితం గా ఒక ప్రభుత్వ అధికారి చెప్పటం, అది కూడా కమీషనర్ స్థాయి లో ఉంది చెప్పటం అనేది అద్భుతం అని విజయ్ తన ఫేస్బుక్ ఖాతా లో పోస్ట్ చేసారు. అయితే ఒక మంచి నాయకుడు పరిపాలిస్తుంటే స్పందన ఇలానే ఉంటుంది అని చెప్పటానికే ఈ పోస్ట్. కమీషనర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, సంఘటన తెలిపిన విజయ్ కు అభినందనలు తెలుపుతున్నాడు ఆంధ్రుడు.

మిగతా శాఖల అధికారులు, ఉద్యోగస్తులు కుడా ఆంధ్రప్రదేశ్ కోసం నిస్వార్ధం గా పని చెయ్యాలని కోరుకుంటున్నాము.