ఏపీ సర్కార్ కు హైకోర్టు లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తప్పులతడకగా జీవోలు విడుదల చేస్తున్న జగన్ అవి న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనే నిర్దారణ చేసుకోకపోవడం వల్లనో, ఆత్మవిశ్వాసం వల్లనో ప్రతిసారి తప్పులో కాలేస్తున్నారు. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్న జగన్ సర్కారును హైకోర్టు మందలించింది. అతనికి పోస్టింగు ఇవ్వడంతో పాటు, పాత జీతాలు కూడా ఇవ్వాలని ఆర్డరు వేసింది.

ఇక ఈయనకు పోస్టుంగు ఇవ్వడమే తరువాయి అన్న చర్చ జరుగుతున్న తరుణంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏబీల మధ్య ఒకపుడు సత్సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. వరంగల్‌లో ఇద్దరు కలిసి పనిచేశారట. అప్పట్లో గౌతంసవాంగ్ ఎస్పీగా ఉంటే ఏబీ ఓఎస్డీగా ఉండేవారట. తర్వాత ఏపీఎస్పీలో కూడా ఇద్దరూ కలిసే పనిచేశారు. గౌతమ్ సవాంగ్ ఐజి- ఏబీ డిఐజీగా ఉండేవారట. తర్వాత వారిద్దరి మధ్య దూరంపెరిగిందట.

మరి ఇపుడు హైకోర్టు ఆదేశాల మేరకు ఏబీకి పోస్టింగు ఇవ్వాల్సింది సర్కారు. మరి ఆయనకు ఏ స్థాయి పోస్టింగ్ ఇస్తుంది? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంలో డీజీపీ వైఖరి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. పోస్టింగు ఇవ్వాలని కోర్టు చెప్పగలదు గానీ… విషయం ఉన్న పోస్టు ఇవ్వమని చెప్పలేదు. సహజంగా జగన్ కు ఏబీకి హోదా తగ్గకుండా అలా అని పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులో తోసేసినా అడిగే హక్కు ఎవరికీ ఉండదు.

రైల్వే, ఫైర్ సర్వీస్, నేషనల్ హైవేస్ వంటి పోస్టింగులు ఇస్తే… చేసేదేమీ ఉండదు. అటు డీజీపీతో సత్సంబంధాలు లేక, ఇక ముఖ్యమంత్రిక నచ్చక… ఇక ఏ పోస్టు వస్తుందో ఊహించుకోవచ్చు. లేదా ఏబీ రాజీ అయితే అవకాశం ఇంకోరకంగా ఉండొచ్చు. కానీ ఏదైనా పెద్ద ఉత్కంఠను రేపుతోంది.