జనవరి 1 తెల్లవారుతూనే సంచలనం ప్రదీప్ డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. 178 పాయింట్లు నమోదు అని. తర్వాత రకరకాల డ్రామాల తర్వాత, పరారీలో ఉన్నాడు అన్న తర్వాత ప్రదీప్ ఒక రోజు ఉదయాన్నే వీడియో తో ప్రతక్ష్యం అయ్యాడు, తప్పు జరిగింది. పోలీసులకు సహకరిస్తాను అని చెప్పాడు, 8వ తారీఖున కౌన్సిలింగ్ కి హాజరయ్యాడు.ఆ తర్వాత కోర్ట్ విచారణకి 16న వస్తాను అంటే, 22న హాజరవ్వమని కోర్ట్ ఆదేశించింది. ఆ రోజునే ప్రదీప్ కి శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. కాని ప్రదీప్ ని ఎట్టి  పరిస్థితుల్లో నాశనం చెయ్యాలని ఒక న్యూస్ చానల్ భావిస్తున్నట్టుగా మీడియా వర్గాల్లో గుస గుస. వివరాల్లోకి వెళ్తే…

అది ఒక పెద్ద న్యూస్ చానల్. రేటింగ్స్ వీరి మెయిన్ ఎజెండా. ఒకానొక టైమ్ లో రెండు న్యూస్ ఛానల్స్ ఈ న్యూస్ ఛానల్ కి చెమటలు పట్టించాయి. తమ చానల్ లో ప్రైమ్ టైం షోకి రేటింగ్స్ తగ్గటానికి కారణం మరొక ఛానల్ లో వస్తున్న షో అని, ఆ షో యాంకర్ అయిన ప్రదీప్ ని ఒక మంచి  షో చెయ్యాలని సదరు న్యూస్ ఛానల్ సంప్రదించగా తనకి ఇంటరెస్ట్ లేదని చెప్పాడట.  దానితో ఈగో హార్ట్ అయిన న్యూస్ ఛానల్ సిఈఓ ప్రదీప్ ని పిలిపించాడట. అప్పుడు ఐన డిస్కషన్ లో కూడా న్యూస్ ఛానల్ లో సినిమా షోస్ కంటే ఎక్కువ చెయ్యలేము, అదే ఎంటర్తైన్మెంట్ ఛానల్ లో ఐతే చాలా రకాలు చెయ్యొచ్చు. కాబట్టి నేను చెయ్యాలేను అని సున్నితం గా చెప్పాడట. దానితో ఆ సిఈఓ అప్పటికి ఆ టాపిక్ వదిలేసినా, తన ఛానల్ ని కాదన్న ప్రదీప్ దొరక్కపోతాడా అని వెయిట్ చేసాడట.కాని ప్రదీప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ అందుకోలేని స్థాయి కి వెళ్ళాడు.  మొన్న న్యూ ఇయర్ రోజు దొరికిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని ప్రదీప్ ని వీలైనంత డేమేజ్ చెయ్యటానికి స్పెషల్ డిబేట్లు, ఫోన్ ఇన్లు పెడుతూ వచ్చింది సదరు ఛానల్. మొన్న కౌన్సిలింగ్ రోజు కూడా గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతూ, మీతో ఆ రోజు కార్లో ఉన్న అమ్మాయిలు ఎవరు అని రెట్టిస్తూ ఇబ్బంది పెట్టేసారు. ప్రదీప్ కి ఆ ఛానల్ ఇంటేన్షన్ క్లియర్ గా తెలుసు కనుక చాలా తెలివి గా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు అని మీడియా వర్గాల్లో గుసగుస.