రాజకీయ వర్గాల్లో ఒక జోక్ ఉంది, వైకాపా నేతలు తమ పార్టి ఆఫీసుల కంటే, నియోజక వర్గాల కంటే ఎక్కువ సేపు జైళ్లలో ఉంటారని.

సరదాగా అనుకోటానికి బాగున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం గా ఏం లేదు. 2014 ఎన్నికలకు ముందు పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు హత్యలు, దొంగ తనాలు, మానభంగాలు,ఏ టి ఏం దొంగ తనాలు ఇలా రోజుకి ఒక వెరైటీ నేరం తో అరెస్ట్ అయ్యారు. పార్టి వ్యవస్థాపక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పలు కేసుల్లో A1 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికి ప్రతి శుక్రవారం పాద యాత్ర కి బ్రేక్ ఇచ్చి సిబిఐ కోర్టులో వాయిదాలకు హాజరు అవుతూనే ఉన్నారు. అదే పార్టి ఏం పి విజయ సాయి రెడ్డి గారు A2 గా ఉన్నారు. అలా కోర్టులకి,జేయిళ్ళకి, నేరాలకి వై కా పా కి అవినాభావ సంబంధం ఉన్నట్టు కనపడిపోతూ ఉంటుంది.

తాజా గా ఈ లిస్టు లోకి మరొక కీలక వైకాపా నేత జాయిన్ అయ్యారు. తమిళనాడు వైకాపా విభాగం సేవాదళ్ కి అధికార ప్రతినిధి గా ఉంటున్న సైకం రామకృష్ణ రెడ్డి బిట్ కాయిన్ పేరుతొ షుమారు 28000 మంది దగ్గర నుంచి 200 కోట్ల రూపాయిలు వసూలు చేసి బోర్డు తిప్పేసాడు. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపం లోని బల్లవరం గ్రామానికి చెందిన రామకృష్ణ రెడ్డి ఢిల్లీ నుంచి చెన్నై దాక డిపాజిట్స్ సేకరించి ఆ డబ్బు తో జగన్ మోహన్ రెడ్డి పాద యాత్రకు సహకరించినట్టు గా  విచారణలో తేలింది. అంతే కాక ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బు కూడా వసూలు చేసే వాడని తేలింది.

డిసెంబర్ మొదటి వారం నుంచి ఫోన్లు ఆపేసి తప్పించుకు తిరుగుతున్న రామకృష్ణ రెడ్డి మీద వచ్చిన కంప్లెయింట్ ఆధారం గా అరెస్ట్ చేసి విచారణకి తరలించారు. సైకం తన సొంత ఊరులో ఉన్నాడని తెల్సుకుని అక్కడకి వెళ్ళిన బాదితుల మీద ఆ ఊరిలో వారు దాడికి తెగ బడ్డారు. మొత్తానికి అరెస్ట్ అవ్వటం తో ఇప్పటికి అయినా తమ డబ్బు తమకు ఇప్పించాలని బాదితులు కోరుకుంటున్నారు.